స్థానికంగా వైసీపీని బలోపేతం చేయండి షేక్ నాజర్

23చూసినవారు
స్థానికంగా వైసీపీని బలోపేతం చేయండి షేక్ నాజర్
పొన్నూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త అంబటి మురళీ కృష్ణ సూచనల మేరకు, నియోజకవర్గ మైనారిటీ నాయకుడు షేక్ నాజర్ ఆధ్వర్యంలో సోమవారం 19వ వార్డులో పార్టీ వార్డు అధ్యక్షులు, కమిటీ సభ్యులు, అనుబంధ విభాగాల కమిటీలు ఏర్పాటు చేశారు. పార్టీ బలోపేతం కోసం వార్డు కమిటీ సభ్యులు సమన్వయంతో కృషి చేయాలని షేక్ నాజర్ సూచించారు. ఈ కార్యక్రమంలో పొన్నూరు మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బోయిన నాగరాజు, మాజీ కౌన్సిలర్ ముక్కాల విజయ్ బాబు, వార్డ్ అధ్యక్షులు అబ్రహం, రాజశేఖర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్