పొన్నూరు నియోజకవర్గ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే ధూళిపాళ్ళ నరేంద్ర కుమార్ మంగళవారం తెలిపారు. పొన్నూరు సెక్షన్ పరిధిలో 3 ప్రధాన రహదారి అభివృద్ధి పనులకు రూ. 8.20 కోట్లు మంజూరు చేసినట్లు, త్వరలో పనులు ప్రారంభం అవుతాయని ఆయన పేర్కొన్నారు.