పినామీల పేరిట రుణాలు స్వాహా చేసిన ఇద్దరు అరెస్ట్

4చూసినవారు
పినామీల పేరిట రుణాలు స్వాహా చేసిన ఇద్దరు అరెస్ట్
గుంటూరు జిల్లా పొన్నూరులో మెప్మాలో బినామీల పేర్లతో రూ. 46 లక్షల రుణాలను స్వాహా చేసిన కేసులో ఆర్పీ నిమ్మకాయల నాగసంధ్య, బినామీ వెంకటసుబ్బయ్యలను గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిని కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి రుక్మిణి 14 రోజుల రిమాండ్ విధించారు. శ్రీ ఆంజనేయ పొదుపు సంఘం పేరుతో బినామీలను సృష్టించి, ఇతర సంఘాల ద్వారా ఈ రుణాలను స్వాహా చేసినట్లు సీఐ వీరా నాయక్ తెలిపారు. ఈ కేసులో మరికొందరిని త్వరలో అరెస్ట్ చేస్తామని ఆయన పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్