గుంటూరు రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. కొత్తపేట పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు. గుంటూరు కోవిడ్ ఫైటర్స్ సభ్యులు ఫిరోజ్ ఖాన్, ఖాదర్, కరీం, గణేష్ మృతదేహాన్ని గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.