
సార్వత్రిక సమ్మెలో భాగంగా కాకుమాను లో ర్యాలీ ప్రదర్శన
కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం కాకుమాను మండల కేంద్రంలోని స్టేట్ బ్యాంక్ వద్ద ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమ్మె ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని ఉద్దేశించి సిఐటియు జిల్లా కార్యదర్శి జి. రమణ, సిఐటియు మండల నాయకులు కందుల శ్రీనివాసరావు మాట్లాడుతూ, కార్మికులు అనేక సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దుచేసి కేంద్రం దుర్మార్గంగా నాలుగు లేబర్ కోడ్ లను తీసుకువచ్చిందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.



































