పెదనందిపాడులో పట్టాదార్ పాస్ పుస్తకాలు పంపిణీ

4చూసినవారు
పెదనందిపాడు శ్రీనివాస కళ్యాణమండపం లో సోమవారం రెవిన్యూ అధికారులు నూతన పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కోడూరి రాంబాబు, గ్రామ పార్టీ అధ్యక్షులు రావి శివరామకృష్ణయ్య, ఐటీడీపీ దివి నాగరాజు, మైనారిటీ నాయకులు షేక్ ఖలీల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాస్ పుస్తకాలలో పొలం కొలతలు తప్పుగా వస్తే తహసిల్దార్ కు తెలియజేస్తే సరిచేసి ఇస్తారని, కూటమి ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరగవని హామీ ఇచ్చారు. రెవెన్యూ సిబ్బంది, కూటమి శ్రేణులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.