రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

2చూసినవారు
పెదనందిపాడు మండల పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కట్టా పీటర్ (65) అనే వృద్ధుడు మృతి చెందారు. పెదనందిపాడు నుండి అడుసుమల్లికి టీవీఎస్ పై వెళుతుండగా, ఉప్పుగుండూరు గ్రామానికి చెందిన ఒక వ్యక్తి నడుపుతున్న ఫోర్డ్ కారు (AP39AB 9639) అదుపుతప్పి టీవీఎస్ ను ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పీటర్ ను 108 ద్వారా ఆసుపత్రికి తరలించే లోపే మరణించారు. పెదనందిపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్