ప్రత్తిపాడులో పెట్రోలు, డీజిల్ కొరత

4819చూసినవారు
ప్రత్తిపాడులో పెట్రోలు, డీజిల్ కొరత
సోషల్ మీడియాలో ఇంధనం అందుబాటులో లేదన్న ప్రచారం రావడంతో వాహనదారులు, రైతులు ప్రత్తిపాడులోని మూడు పెట్రోలు బంకులకు భారీగా చేరుకుని క్యూల్లో నిలబడ్డారు. ఇదే సమయంలో మొక్కజొన్న కోత పనులు యంత్రాలతో వేగంగా సాగుతుండటంతో యంత్రాల యజమానులు వందల లీటర్ల ఇంధనం తీసుకుని ట్యాంకులను ఫుల్ చేసుకున్నారు. దీంతో రాత్రి 9 గంటల తర్వాత బంకుల్లో నిల్వలు తగ్గి కొరత ఏర్పడింది. ఆదివారం సాయంత్రానికి ఇంధనం సరఫరా అవుతుందని బంకు సిబ్బంది తెలిపారు.

సంబంధిత పోస్ట్