మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెదనందిపాడు మండలం అన్నవరం గ్రామంలో శుక్రవారం వైఎస్ఆర్సిపి ఇన్చార్జి బలసాని కిరణ్ కుమార్ 'రచ్చబండ' కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజల నుండి సంతకాలు సేకరించి, ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని వివరించారు. అనంతరం గ్రామ కమిటీలను నియమించారు. ప్రత్తిపాడు ఇన్చార్జి రసూల్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.