ప్రత్తిపాడు: బీటెక్ విద్యార్థి అదృశ్యం...

0చూసినవారు
ప్రత్తిపాడు: బీటెక్ విద్యార్థి అదృశ్యం...
గుంటూరు జిల్లా ప్రత్తిపాడుకు చెందిన బీటెక్ నాలుగో సంవత్సరం విద్యార్థి లావుడియా హనుమానాయక్ అదృశ్యమైనట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. సెలవుల నేపథ్యంలో స్థానిక రెస్టారెంట్‌లో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్న హనుమానాయక్ సోమవారం సాయంత్రం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదు. ఫోన్‌కు స్పందించకపోవడంతో తల్లి కమల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై నరహరి తెలిపారు.

ట్యాగ్స్ :