రైతు పక్షపాతిగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సి. సి. ఐ) పనిచేయాలని కేంద్ర కమ్యూనికేషన్లు, గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్ర శేఖర్ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా, ప్రత్తిపాడు శాసన సభ్యులు డా. బూర్ల రామాంజనేయులుతో కలసి అధికారులతో పత్తి కొనుగోలుపై మంత్రి సమీక్షించారు. రైతుల వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని సి. సి. ఐ వ్యవహరించాలని ఆయన సూచించారు.