బుధవారం వట్టి చేరుకూరు మండలం వింజనంపాడు గ్రామ సచివాలయంలో యూరియా కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు వచ్చిన రైతులు, మాటల పెరిగి గొడవకు దిగారు. ఈ క్రమంలో సచివాలయంలోని కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను ధ్వంసం చేశారు. సచివాలయ సెక్రటరీ పి. లక్ష్మీ శారద ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.