పెదనందిపాడు మండలం గొగులమూడికి చెందిన హవల్దార్ జక్కం సత్యనారాయణరావు, మద్రాస్ ఇన్ఫెంట్రీలో 24 ఏళ్ల పాటు దేశసేవ చేసి పదవీ విరమణ చేశారు. సోమవారం, ఆయన స్వగ్రామంలో కులమతాలకు అతీతంగా గ్రామస్తులంతా ఏకమై, త్రివర్ణ పతాకాలు చేతబూని, డప్పు వాయిద్యాలు, డీజేలతో వాహనంపై "సల్వా"తో ఘనస్వాగతం పలికారు. అనంతరం దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడి, ఘనంగా సత్కరించారు.