ప్రత్తిపాడు మండలం ఏవో షేక్. సుగుణ బేగం శుక్రవారం గ్రామంలో పత్తి పంట పొలాలను పరిశీలించారు. పొలాల్లో నిలిచిన నీటిని తొలగించి ఎకరానికి 25 నుంచి 30 కిలోల యూరియా మరియు 10 నుంచి 15 కిలోల మూర్రెట్ ఆఫ్ పొటాష్ అదనంగా వెయ్యాలని సూచించారు. పూత, పిందె, కాయ రాలుట నివారణకు నాఫ్తాలిన్ అసిటిక్ యాసిడ్ 1మిల్లీ/4. 5లీటర్ నీటికి చొప్పున కలుపుకొని ఒకటి లేదా రెండు సార్లు 10 నుంచి 15 రోజులు వ్యవధిలో పిచికారి చేసుకోవాలని తెలిపారు.