గుంటూరు జిల్లా పెదనందిపాడు మండల విద్యాశాఖ అధికారిగా కేఎఫ్ కెనడి శుక్రవారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో విద్యాభివృద్ధికి సిబ్బంది సమన్వయంతో కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ ఏడాది పది పరీక్షల్లో నూరు శాతం ఫలితాలు సాధించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. కాకుమాను ఎంఈఓ గా విధులు నిర్వహిస్తూ బదిలీపై పెదనందిపాడు వచ్చినట్లు వెల్లడించారు.