ప్రతిపాడు: తుఫాను బాధితులకు నగదు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బూర్ల

18చూసినవారు
మొంథా తుఫాన్ బాధితులకు శనివారం ప్రత్తిపాడు శాసనసభ్యులు బూర్ల రామాంజనేయులు చేతుల మీదుగా నగదు పంపిణీ చేశారు. తురకపాలెం, పెదపలకలూరు గ్రామాల్లోని పునరావాస కేంద్రాల్లో నివాసం ఉన్న బాధితులకు ఈ సహాయం అందింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బూర్ల మాట్లాడుతూ, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని సీఎం చంద్రబాబు నాయుడు సారధ్యంలో ఆదుకోవటం జరిగిందని, కూటమి ప్రభుత్వం పేదల పక్షపాతి అని పేర్కొన్నారు. కూటమి శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you