కాకుమాను మండలం కె. బి పాలెం గ్రామంలో మంగళవారం మాజీ సీఎం వై. యస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రత్తిపాడు ఇన్చార్జి బలసాని కిరణకుమార్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ప్రజల నుండి సంతకాలు సేకరించి, పీపీపీ విధానం వల్ల ప్రజలకు కలిగే నష్టాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రత్తిపాడు తెనాలి వైసిపి పరిశీలకు షేక్ రసూల్, గ్రామ వైసిపి నేతలు పాల్గొన్నారు.