పెదనందిపాడు మండలం కొప్పర్రు గ్రామంలో సోమవారం రాత్రి మాజీ సీఎం వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు, ప్రత్తిపాడు వైసిపి ఇన్చార్జి బాలసాని కిరణ్ కుమార్ నేతృత్వంలో రచ్చబండ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పిపిపి విధానానికి వ్యతిరేకంగా ప్రజల నుండి కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు షేక్ ఖాసీం పీరా, గ్రామ నాయకులు పాల్గొన్నారు.