ప్రత్తిపాడు కేంద్రంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమం పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న పరిశీలకురాలు సౌమ్యారెడ్డి, డిసిసి అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా నాయకులు, కార్యకర్తల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణుల నుంచి పలువురు అభిప్రాయాలు సేకరించారు. నియోజకవర్గ అధ్యక్షుడు కొరివి వినయ్ కుమార్, వణుకూరి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.