ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్లరామాంజనేయులు అడవితక్కెళ్లపాడు లోని గురుకుల పాఠశాలలో గురువారం మెగా పేరెంట్స్ టీచర్స్ 2. 0 కార్యక్రమంలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ ధ్యేయంగా రాష్ట్రంలో అక్షరాస్యతలో నూటికి నూరు శాతం మంచి ఫలితాలతో విజయం సాధించాలని కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఎంతో అవసరమై తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు కూటమి నేతలు పాల్గొన్నారు.