గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలోని పెదనందిపాడు గ్రామంలో మంగళవారం నల్లమడ వాగు కట్ట పడమర వైపు ఆలపాటి ముసలయ్య పొలంలో సుమారు 60 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గ్రామస్తులు గుర్తించారు. ఈ సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించారు. మృతదేహం ఎవరిదో, మరణానికి గల కారణాలు వంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.