కాకుమానులో గ్రామ కార్యదర్శిని గదిలో బంధించిన సర్పంచ్

1చూసినవారు
గుంటూరు జిల్లా కాకుమాను మండలం పాండ్రపాడు గ్రామ పంచాయతీ కార్యదర్శి అమరేశ్వరరావును బుధవారం కార్యాలయం వద్ద గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు అడ్డుకున్నారు. గతంలో చేసిన బిల్లులు చేయటం లేదంటూ కార్యదర్శిని గదిలో నిర్బంధించారు. కార్యదర్శి ఫిర్యాదుతో పోలీసులు చేరుకోగా, వాహనంలో తీసుకెళ్లేందుకు ప్రయత్నించినప్పుడు సర్పంచ్, వార్డు సభ్యులు వాహనం ముందు ఆందోళన చేశారు. జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం ఇస్తామని పోలీసులు హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్