Apr 12, 2026, 03:04 IST/
బాల రాముడి ఆలయ నిర్మాణం పూర్తి (వీడియో)
Apr 12, 2026, 03:04 IST
అయోధ్యలో బాల రాముడి ఆలయ నిర్మాణం విజయవంతంగా పూర్తయింది. సుమారు రూ.1,800 కోట్ల వ్యయంతో చేపట్టిన ప్రధాన, అనుబంధ ఆలయాల పనులు ముగిసినట్లు నిర్మాణ కమిటీ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా ప్రకటించారు. రామ్ లల్లా విగ్రహం ఉన్న తాత్కాలిక కట్టడంలో పవిత్ర జ్యోతిని వెలిగించారు. భక్తుల సందర్శనార్థం ఉప ఆలయాలను ఈనెల 14 నుంచి అందుబాటులోకి తీసుకురావాలని కమిటీ నిర్ణయించింది.