
రేపల్లె: సిఐటియు అఖిలభారత మహాసభలను జయప్రదం చేయండి
విశాఖపట్నంలో డిసెంబర్ 31 నుండి జనవరి 4వ తేదీ వరకు జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలను జయప్రదం చేయాలని కోరుతూ, సిఐటియు యూనియన్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కే. ధనలక్ష్మి ఆధ్వర్యంలో శ్రామిక మహిళలు, రేపల్లె మెప్మా ఆర్పి, ఐకెపి వివోఏలతో శుక్రవారం విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో భాగంగా సిఐటియు కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు బాపట్ల జిల్లా కోశాధికారి మణిలాల్ కూడా పాల్గొన్నారు.








































