Jan 27, 2026, 15:01 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
ఫిబ్రవరి 2, 3 తేదీల్లో సీఎం కప్ క్రీడా పోటీలు
Jan 27, 2026, 15:01 IST
ఈ నెల 28 నుంచి 30 తేదీలలో వరకు నిర్వహించాల్సిన మున్సిపాలిటీ, మండల స్థాయి సీఎం కప్ క్రీడా పోటీలు అనివార్య కారణాలవల్ల వాయిదా పడినట్లు మండల విద్యాశాఖ అధికారి రాజయ్య తెలిపారు. వాయిదా పడిన క్రీడా పోటీలను ఫిబ్రవరి 2, 3 తేదీలలో మున్సిపాలిటీ, మండల స్థాయిలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సీఎం కప్ క్రీడా పోటీల్లో వాలీబాల్, కబడ్డీ, ఖో- ఖో, అథ్లెటిక్స్ విభాగాల్లో పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించాల్సిందిగా మండల విద్యాశాఖ అధికారి పిలుపునిచ్చారు.