జీతాలు అడిగిన అంగన్వాడీ లను అరెస్టు చేయడం దారుణం

17చూసినవారు
జీతాలు అడిగిన అంగన్వాడీ లను అరెస్టు చేయడం దారుణం
జీతాలు అడిగిన అంగన్వాడీ కార్యకర్తలను అరెస్టు చేయటం దారుణమని బాపట్ల జిల్లా సిఐటియు కోశాధికారి సిహెచ్ మణిపాల్ అన్నారు. మంగళవారం రేపల్లెలో బస్టాండ్ ఎదురు అంగన్వాడీ కార్యకర్తలతో ధర్నా నిర్వహించారు. వేతనాలు పెంచుతామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహా ధర్నాలో భాగంగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోవడంతో రాత్రికి కూడా మహిళలు ధర్నా శిబిరంలో ఉండగా అరెస్టు చేయటం దారుణమని మణిపాల్ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్