జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ మంగళవారం నిజాంపట్నం మండలం, బొర్రావారి పాలెం గ్రామంలో పంపు హౌస్, మంచినీటి కుంట, విలేజీ క్లినిక్, పంచాయతీ భవనాలను పరిశీలించారు. గ్రామ పంచాయతీ పరిధిలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాల పనులు సకాలంలో పూర్తి చేయాలని, ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరు అందించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. ఈ పరిశీలనలో డిపిఓ ఎల్. ప్రభాకర్ రావు, గ్రామీణ నీటి సరాఫరా శాఖ ఎస్ఈ అనంత రాజు కూడా పాల్గొన్నారు.