రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ తహసిల్దార్

5చూసినవారు
రాజముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ తహసిల్దార్
రేపల్లె మండలం ఉప్పూడి గ్రామంలో బుధవారం రీ సర్వే పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తహసిల్దార్ ఎం శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని పాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో జగన్ రెడ్డి ఫోటోలతో పాస్ పుస్తకాలు ముద్రించారని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేస్తోందని శివప్రసాద్ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్