సోమవారం, రేపల్లె డీఎస్పీ ఆవుల శ్రీనివాసరావు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు రేపల్లె, చెరుకుపల్లి, నగరంలలోని బాణసంచా గోడౌన్లను తనిఖీ చేశారు. గోడౌన్లలో భద్రత కోసం ఏర్పాటు చేసిన పరికరాలను పర్యవేక్షించి, ప్రజల భద్రత దృష్ట్యా గోడౌన్ యజమానులకు పలు సూచనలు చేశారు. అగ్నిమాపక శాఖ అధికారుల సూచనల మేరకు గోడౌన్లు ఉండాలని డీఎస్పీ శ్రీనివాసరావు హెచ్చరించారు.