మొక్కజొన్న రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలి జె. బి. పి

7చూసినవారు
రాష్ట్రవ్యాప్తంగా తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జై భీమ్రావు భారత పార్టీ రేపల్లె ఇంచార్జి దోవా రమేష్ రాంజీ డిమాండ్ చేశారు. మంగళవారం రైతు సంఘాల పిలుపుమేరకు రేపల్లె ఆర్డీవో కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. క్వింటా రూ. 2, 400లకు మార్క్‌ఫెడ్ / నాఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని, ఇప్పటికే మార్కెట్‌లో అమ్మిన రైతులకు ధర వ్యత్యాసం వెంటనే చెల్లించాలని కోరారు. కేంద్రం ప్రకటించిన మద్దతు ధర ప్రకారం వ్యాపారులు కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you