
తెలంగాణలో మరో యాసిడ్ దాడి
తెలంగాణలో మరో యాసిడ్ దాడి జరిగింది. వరంగల్ జిల్లా కాజీపేట మండలం కడిపికొండ వద్ద నర్సింగ్ విద్యార్థినిపై గుర్తు తెలియని వ్యక్తులు యాసిడ్ దాడి చేశారు. గాయపడిన విద్యార్థినిని వెంటనే ఎంజీఎంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.




