రేపల్లె: భక్తిశ్రద్ధలతో శ్రీవారికి దీపోత్సవం

11చూసినవారు
రేపల్లె: భక్తిశ్రద్ధలతో శ్రీవారికి దీపోత్సవం
రేపల్లె పట్టణం ఉప్పూడి రోడ్ లోని శ్రీ లక్ష్మీ గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో కార్తీకమాసం సందర్భంగా, కార్తీక శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని శనివారం రాత్రి శ్రీవారికి దీపోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి భక్తులు, పురప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్