రేపల్లె: పశుపోషకులకు దాణా పంపిణీ

6చూసినవారు
రేపల్లె: పశుపోషకులకు దాణా పంపిణీ
మంత్రి అనగాని సత్య ప్రసాద్ ఆదేశాల మేరకు, నిజాంపట్నం మండలంలోని తుఫాన్ ప్రభావిత గ్రామాల్లోని పాడి రైతులకు శనివారం మంత్రి సోదరులు అనగాని శివప్రసాద్ ఉచిత పశువుల దాణాను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం జడ్పిటిసి నర్రా సుబ్బయ్య, పార్టీ శ్రేణులు, రైతులు పాల్గొన్నారు.