రేపల్లె పురపాలక సంఘంలో శానిటరీ ఇన్స్పెక్టర్ గా పనిచేసిన ఆకురాతి రామచంద్రరావుకు ప్రభుత్వం కమిషనర్ గా పదోన్నతి కల్పించింది. ఈ నేపథ్యంలో గురువారం స్థానిక పురపాలక సంఘం కార్యాలయంలో రామచంద్ర రావును రాష్ట్ర రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్య ప్రసాద్ అభినందించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, సిబ్బంది పాల్గొని రామచంద్రరావును అభినందించారు.