శుక్రవారం రేపల్లె పట్టణంలో మంత్రి అనగానే సత్యప్రసాద్ రైతులకు ప్రభుత్వ రాజముద్రతోపాటు క్యూఆర్ కోడ్స్‌తో రూపొందించిన కొత్త పాసు పుస్తకాలను అందజేశారు. జగన్ బొమ్మ స్థానంలో ప్రభుత్వ రాజముద్ర, క్యూఆర్ కోడ్‌లతో కూడిన 21.86 లక్షల పాస్ పుస్తకాలను వెబ్ ల్యాండ్‌లోని వివరాలతో సహా ముద్రించడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్, కలెక్టర్ వి వినోద్ కుమార్, అధికారులు పాల్గొన్నారు.