రేపల్లెలో అటవీశాఖ అధికారి వివి రమణారావు కాంట్రాక్టర్ కర్రీ వీర్లంకయ్య వద్ద ఓ బిల్లు నిమిత్తం రూ. 25 లక్షలు డిమాండ్ చేయగా, వీర్లంకయ్య ఏసీబీని ఆశ్రయించాడు. దీనితో గురువారం వివి రమణారావు తన కార్యాలయం బయట నగదుతో సహా ఏసీబీ అధికారులకు అదుపులోకి చిక్కాడు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.