యుద్ధం కారణంగా దేశవ్యాప్తంగా ఆయిల్, గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిన నేపథ్యంలో, ప్రజల అవసరాలకు అనుగుణంగా పెట్రోలు, డీజిల్ సరఫరా చేయాలని కోరుతూ మంగళవారం సీపీఎం, సీఐటీయూ నాయకులు రేపల్లె బస్టాండ్ సెంటర్‌లో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి సిహెచ్. గంగయ్య మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చమురు సమస్యలను అధిగమించడానికి ప్రణాళికాబద్ధంగా ప్రయత్నించాలని, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలలో లేని కొరతను ఆంధ్రప్రదేశ్‌లో సృష్టిస్తున్నారని ఆరోపించారు.