గ్రామస్థాయిలో పార్టీలు బలోపేతం చేయండి పీటా

3చూసినవారు
గ్రామస్థాయిలో పార్టీలు బలోపేతం చేయండి పీటా
రేపల్లె నియోజకవర్గంలో వైఎస్ఆర్సిపి పార్టీని బలోపేతం చేసేందుకు గ్రామాల్లోని నాయకులతో సమావేశాలు నిర్వహిస్తున్నట్లు నియోజకవర్గ సమన్వయకర్త పీటా నాగ మోహన కృష్ణ తెలిపారు. ఆదివారం రాత్రి నల్లూరుపాలెం లో 'కాఫీ విత్ కేడర్' నిర్వహించారు. అధికార కూటమి ప్రభుత్వం అరాచకాలను, వైసీపీ నాయకులపై పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులకు గురిచేస్తున్న తీరును కార్యకర్తలు ఆయన దృష్టికి తెచ్చారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి అధికారంలోకి రావడం ఖాయమని, ప్రజలంతా జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్