ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పరిశుభ్రంగా, నాణ్యతతో అందించాలని మండల విద్యాశాఖ అధికారి కే సురేష్ ఆదేశించారు. మంగళవారం ఆంధ్ర రత్న మున్సిపల్ ఉన్నత పాఠశాలలో ఏజెన్సీ నిర్వాహకులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో లోటుపాట్లు లేకుండా చూడాలని సూచించారు. విద్యా వనరుల కేంద్రం నుంచి బిల్లులు సకాలంలో అందిస్తామని తెలిపారు.