శుక్రవారం బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం కోళ్ల పాలెం గ్రామంలో గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా డాక్టర్ ఉప్పలపు పావని ప్రియాంక మాట్లాడుతూ, ప్రపంచ మానవాళికి స్వేచ్ఛ, సమానత్వం, సౌబ్రాత్రుత్వం కొరకు అష్టాంగ మార్గాలను పంచశీలను ప్రబోధించిన గౌతమ బుద్ధుని బోధనలు ప్రపంచశాంతికి దిక్సూచి వంటివని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విగ్రహానికి పూలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైద్య శిబిరం నిర్వహించి 200 మందికి వైద్య
పరీక్షలు చేశారు. ఆది ఆంధ్ర నవబుద్ధిష్ట్ సొసైటీ అధ్యక్ష కార్యదర్శులు నీల జోజి బాబు, దోవా రమేష్ రాంజీ, బహుజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ పర్రె కోటయ్య పాల్గొన్నారు.