
రేపల్లె: ఎన్టీఆర్ నగర్ లో వసతులు కల్పించండి
ఎన్టీఆర్ నగర్ (పాత జగన్ కాలనీ) వాసులు పట్టణ తెదేపా కార్యాలయంలో సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ ను కలిసి, తమ కాలనీ అభివృద్ధికి రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ ద్వారా నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రేపల్లె పట్టణ కార్యదర్శి సిహెచ్. మణిలాల్, ఎన్టీఆర్ నగర్ అభివృద్ధి కమిటీ కన్వీనర్ వి. ధనమ్మ, ఐద్వా రేపల్లె పట్టణ అధ్యక్షురాలు ఎస్ కే. షకీరా, మరియు అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కాలనీ అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.






























