
రేపల్లె: లంకవాణి దిబ్బ గ్రామంలో పర్యటించిన ఈ పూరి
రేపల్లె మండలం కృష్ణానది వరద ప్రవాహక ప్రాంతంలోని లంకవాణిదిబ్బ గ్రామంలో బుధవారం వైఎస్ఆర్సిపి సమన్వయకర్త ఈపూరి గణేష్ పార్టీ శ్రేణులతో కలిసి పర్యటించారు. పునరావాస కేంద్రాల్లో ఉన్న కుటుంబాలను పరామర్శించి, ప్రభుత్వం వరద బాధితులకు మెరుగైన సదుపాయాలు కల్పించాలని, రోగాలు ప్రబలకుండా వైద్య బృందాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.





































