
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి సిడిపిఓ
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదివారం రేపల్లె ఐసీడీఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా సిడిపిఓ సుచిత్ర మాట్లాడుతూ, మహిళలు సాధికారత సాధించి, సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, వారికి ప్రభుత్వాలు సమాన హక్కులు కల్పించాలని అన్నారు. మహిళల పాత్రపై డిఎల్పిఓ పద్మావతి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రవిబాబు, డిప్యూటీ ఎంపీడీఓ ప్రసాదరావు కూడా పాల్గొన్నారు.






























