
రేపల్లె: రబీ విత్తన శుద్ధి పై రైతులకు అవగాహన
రేపల్లె మండలంలోని చాట్రగడ్డ, కామరాజుగడ్డ గ్రామాలలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో 'పొలం పిలుస్తుంది' కార్యక్రమం జరిగింది. మండల వ్యవసాయ అధికారి మహేష్ రైతులకు విత్తనాలు ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని, ట్రైకోడెర్మా విరిడి మందును 10 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈ భువనేశ్వరి, రైతులు పాల్గొన్నారు.








































