
అక్రమ కేసులు పెట్టినా రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తున్నాం.. కాసు మహేష్‌రెడ్డి
తమపై అక్రమ కేసులు బనాయించినా రెట్టింపు ఉత్సాహంతో ప్రజల్లో పనిచేస్తున్నామని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. నరసరావుపేటలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ, రాజకీయ కక్షలు మాని రాష్ట్ర అభివృద్ధిలో పోటీ పడాలని ప్రభుత్వానికి సూచించారు. వైసీపీ హయాంలో కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి, జాతీయ రహదారి తెచ్చామని, ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టాలని ఆయన తెలిపారు.


































