అమరావతిలోని ఆర్టీజీఎస్ నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం సమీక్ష నిర్వహించారు. పరిపాలనలో పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని, అధికారుల పనితీరును నేరుగా ప్రజలకు వివరిస్తామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల పనితీరును మెరుగుపరిచేందుకు ప్రత్యేక శిక్షణా కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం ప్రకటించారు.