జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా బుధవారం రాజుపాలెం మండలాన్ని సందర్శించి, తహశీల్దార్ కార్యాలయం, ఐసీడీఎస్ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, ప్రభుత్వ పథకాలను పారదర్శకంగా, సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. హాజరు, రికార్డులు, సేవల అమలుపై ఆరా తీసి, ప్రజా సేవలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.