తుపాన్ బీభత్సం: తీర ప్రాంతాలకు పర్యాటకుల నిషేధం

3160చూసినవారు
తుపాన్ ప్రభావంతో తీర ప్రాంత రహదారులకు నష్టం వాటిల్లడంతో, బాపట్ల జిల్లాలోని చీరాల, వాడరేవు, రామాపురం, పొట్టిసుబ్బాయిపాలెం బీచ్‌లలో పర్యాటకులు, భక్తుల రాకను తాత్కాలికంగా నిషేధించారు. ఆదివారం వాడరేవు తీరాన్ని RDO చంద్రశేఖర్ నాయుడు పరిశీలించారు. DSP రామాంజనేయులు, DSP ఆవుల శ్రీనివాసరావు కూడా పలు బీచ్‌లకు అనుమతి లేదని తెలిపారు. ఈ నెల 3, 4 తేదీలలో (సోమవారం, మంగళవారం) తీర ప్రాంత సందర్శన నిషేధించబడింది. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులు సహకరించాలని అధికారులు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్