పల్నాడు జిల్లా సత్తెనపల్లి సబ్‌జైలు నుంచి జీవిత ఖైదీ శ్రీనివాసరావు పరారైన ఘటన కలకలం రేపింది. గుంటూరులో జరిగిన హత్య కేసులో ముద్దాయిగా ఉన్న అతడు, సోమవారం సాయంత్రం జైలులోని పెట్రోల్ బంక్ వద్ద పని చేస్తుండగా తప్పించుకున్నాడు. జైలు సూపరింటెండెంట్ వెంకటరత్నం ఈ విషయాన్ని తెలిపారు. మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి పరారీలో ఉన్న ఖైదీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జైలు భద్రతపై చర్చనీయాంశంగా మారింది.