నకరికల్లు మండలం చీమలమర్రి శివారులో కోడిపందేల స్థావరంపై శుక్రవారం పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ దాడుల్లో 12 మంది జూదగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 32 బైకులు, రూ. 20,450 నగదు, మూడు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు తావు లేదని ఎస్ఐ సతీశ్ హెచ్చరించారు.